వైసీపీ అధినేత, సీఎం జగన్ మరోసారి తన మనసులో ముస్లిం వర్గాలకు ఉన్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. నిజానికి ఆది నుంచి కూడా వైఎస్ కుటుంబం ముస్లిం వర్గాలకు అత్యంత సానుకూలం. అందుకే 2014 సహా 2019లోనూ వైసీపీ తరఫున పోటీ చేసిన ముస్లిం నాయకులు విజయం సాధించారు. ముస్లిం వర్గాల్లో గతంలో వైఎస్‌కు ఎంత బలం, అనుచర గణం, ఫాలోయింగ్ ఉందో.. ఇప్పుడు అదే ఫాలోయింగ్ వైసీపీ అధినేతగా జగన్‌కు ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన తన కేబినెట్‌లోనూ ముస్లిం వర్గానికి చెందిన నాయకుడికి చోటు కల్పించారు. అంతేకాదు, ఆయనకు ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి గౌరవించారు.
నిజానికి ముస్లిం వర్గాలకు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా.. జగన్ ముందు చూపుతో వారికి మేలు చేస్తూనే ఉన్నారు. ఎవరైనా రాజకీయ నాయకుడు ఓ వర్గాన్ని చేరదీస్తే.. దానివెనుక ఖచ్చితంగా ఓటు బ్యాంకు రాజకీయం ఉంటుంది. కానీ జగన్ విషయం లో అలాంటి పరిస్థితి లేదు. ఓటు బ్యాంకుగా కాకుండా మైనార్టీ కోణంలోనే వారిని గుండెలకు హత్తు కోవడం, వారి కష్టంలో నేనున్నానంటూ.. ముందుకు సాగడం వంటివి కనిపిస్తున్నాయి. మౌజమ్‌లకు, ఇమామ్‌లకు వేతనం ప్రకటించారు. అదేసమయంలో మక్కా యాత్రకు ఇచ్చే నిధులను కూడా భారీగా పెంచారు. సరే! ఇదంతా పాతవిషయమే.
ఇప్పుడు తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలోలాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో ఏ పండగొచ్చినా.. ఏ కార్యక్ర మమైనా.. కూడా ఇంటికే పరిమితం. ఎలాంటి వారైనా కూడా ఇళ్లలోనే చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో తాజాగా రంజాన్ మా సం ప్రారంభమైంది. అయినప్పటికీ.. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ, కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడా ఎలాంటి మినహాయింపులు ఇవ్వలే దు. కానీ, ఏపీలో మాత్రం ముస్లింలకు కీలకమైన రంజాన్‌ను పురస్కరించుకుని జగన్ ప్రభుత్వం కొన్ని వెసులుబాటులు కల్పించింది. మసీదుల్లో ఐదుగురు చొప్పున ప్రార్థనలు చేసుకునేందుకు ఛాన్స్ కల్పించింది.
ఇఫ్తార్, సెహరీ విందులు ఏర్పాటు చేసుకునేందుకు హోటల్లను కూడా తెరిచి ఉంచుకునేందుకు ఛాన్స్ కల్పించింది. ఇక, కీలక మైన ముస్లిం దాతలు.. తమ దాతృత్వాన్ని చూపుకొనేందుకు, పేద ముస్లింలకు సాయం చేసుకునేందుకు కూడా తెల్లవారు జా మునే 3 గంటల నుంచి 5.30 వరకు, సాయంత్రం 6.30 నుంచి 8 వరకు కూడా అవకాశం కల్పించారు. ఇక, ముస్లిం వర్గాలు నిత్యావసరాలకు, పండ్లకు ఇబ్బంది పడకుండా వారికి అనుకూలంగా ఉదయం పది వరకు కూడా ఆయా దుకాణాలు తెరిచి ఉంచేలా జగన్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా చూస్తే.. కరోనా మహమ్మారి వల్ల ఒకపక్క భయం ఉన్నా.. మరోపక్క, ముస్లింల సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం, జాగ్రత్తలతో కూడిన వెసులుబాట్లు కల్పించడం వంటివి జగన్‌కు మాత్రమే చెల్లిందని అంటున్నారు పరిశీలకులు.