దేవుడా సుమ… మ‌ళ్లీ ఫాంలోకి వ‌చ్చారా?

-

టాలీవుడ్ లో సినిమాలతోనే కాకుండా.. యాంక‌ర్ గా చేసి కూడా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిరూపించిన వారు.. సుమ క‌న‌కాల‌. సినిమాల్లో త‌క్క‌వగా న‌టించినా.. సుమ క‌న‌కాల‌ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తు.. సినిమా హీరోలు, హీరోయిన్స్ తో స‌మానంగా పేరు సంపాదించుకుంది. టాలీవుడ్ లో ప్ర‌స్తుతం నెంబ‌ర్ వ‌న్ యాంక‌ర్ అన‌గానే.. సుమ క‌న‌కాల అంటూ అంద‌రూ చెప్పే విధంగా సుమ క‌న‌కాల త‌న క్రేజ్ ను పెంచుకుంది. ఈ టీవీలో స్టార్ మ‌హిళా అనే కార్యక్ర‌మంతో సుమ క‌న‌కాల‌.. బాగా పేరు తెచ్చుకుంది. కేరళ కు చెందిన సుమ క‌న‌కాల‌.. తెలుగులో అన‌ర్గ‌ళంగా మాట్లాడంతో యాంక‌ర్ గా అనేక అవ‌కాశాలు వ‌చ్చాయి.

సుమ క‌న‌కాల‌.. త‌న క్రేజ్ పెరుగుతున్న కొద్ది స్పీడ్ ను కూడా పెంచేసింది. చిన్న చిన్న టీవీ షోల నుంచి సినిమా ఫంక్షన‌ల వ‌రకు ఎదిగింది. ఒక్క స్థాయిలో సుమ లేకుంటే.. సినిమా ఆడియో ఫంక్షన్, ఫ్రీ రీలిజ్ ఈవెంట్ వాయిదా వేసుకునేంత వ‌ర‌కు సుమ ఎదిగింది. అలాగే సుమ స్టేజ్ ఎక్కితే.. త‌న మాట‌ల‌తో అభిమానుల్లో అరుపులు… కేక‌లు పెట్టిస్తుంది. హీరోల‌ను, హీరోయిన్లును ప‌ల‌క‌రిస్తు.. హంగామా చేస్తుంది. అయితే.. గ‌త కొద్ది రోజుల నుంచి సుమ క‌న‌కాల ఫాం కోల్పోయిన‌ట్టు క‌నిపిస్తుంది.

ఈ మ‌ధ్య కాలంలో సినిమా ఫంక్షన‌ల‌కు సుమ క‌నిపించ‌డం లేదు. ఒక వేళ సుమ సినిమా ఫంక్షన్ల‌కు క‌నిపించినా.. మునుప‌టి జోష్ క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల భీమ్లా నాయక్ సినిమా ఫంక్షన్ లోనూ.. సుమ ముంద‌టి సంద‌డి క‌నిపంచ‌లేదు. అయితే ప్ర‌స్తుతం యాంక‌ర్ సుమ తిరిగి ఫాం లోకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. తిరిగి ఆ సంద‌డి అభిమానుల ముందుకు వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news