సరస్వతీ రూపంలో అమ్మవారి దర్శనం..రాత్రి వరకూ అమ్మవారి దర్శనాలు

దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెల్లవారు జామున మూడు గంటల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో, మూల నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు..సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.కరోనా జాగ్రత్తల మధ్య భక్తులు..

అమ్మ దర్శనం చేసుకుంటున్నారు..ఉదయం మూడు గంటల నుంచి రాత్రి 9గంటలవరకూ భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో సురేష్ బాబు తెలిపారు. ఆన్ లైన్ లో 13వేల టికెట్లు జారీ చేశామన్న ఈవో..టైం స్లాట్ ను బట్టి అప్పటికప్పుడు టికెట్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు.