కరోనా విజృంభణ.. మంత్రి హరీష్ రావు అదిరిపోయే స్టెప్..!

-

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సిద్దిపేట ప్రజల్లో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ,నేను ఉన్న అనే భరోసా నింపుతున్న మంత్రి హరీష్ రావు .. మరో ముందడుగు వేస్తూ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రజలకు వారి చెంతనే సులువుగా పరీక్షలు చేసేందుకు మొబైల్ బస్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సదుపాయం వలన వ్యాది లక్షణాలతో , జ్వరంతో ,ఒంటి నొప్పుల తో ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రికీ వెళ్లేందుకు వ్యయ ప్రయసలు ఉండవు అంతే కాకుండా ఆ వ్యక్తి ప్రయాణిస్తున్న ఆటో కాని మరే ఇతర వాహనంలో ఇతరులకు వ్యాప్తి చెందదు.

కరోనా నివారణకు దాదాపు నాలుగు నెలల నుండి.. తానే స్వయంగా , ప్రజాప్రతినిధులతో, ఆరోగ్య శాఖతో కలిసి ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటూన్నారు. ఈ సదర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాకు కరోనా వచింది ఏమో అనే అనుమానం… టెస్ట్ కు వెళితే నమూనాలు సేకరించి హైదరాబాద్ కు పంపాము ఫలితాల కోసం వేచియున్నం అనే మాట నిన్నటి దాకా..  కానీ ఇక ముందు నుండి మనం ఇక్కడ టెస్ట్ లు చేపించుకున్న 8 గంటల్లోనే మన సిద్దిపేట వైద్య కళశాల లో ఫలితాలు రానున్నాయ్ అని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో తొలి వైద్య కళాశాల సిద్దిపేటకు ఆర్టీ పిసి ఆర్ టెస్ట్ లకు ( వ్యాధి నిర్ధారణ ) అఖిల భారత ఇండియన్ వైద్య పరిశోధన  ICMR అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు అయిన వైద్య కళశాల లో భాగంగా తొలి అనుమతి సిద్దిపేటకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news