గంగాదేవిప‌ల్లిలో బంగారం ల‌భ్యం.. ఆడియో వైర‌ల్..!

-

తెలంగాణ‌లో పెద్ద ఎత్తున బంగారం ల‌భ్య‌మైంద‌ని సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ముఖ్యంగా గుప్త నిధుల త‌వ్వ‌కాల్లో పెద్ద ఎత్తున గంగదేవిపల్లిలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆ గ్రామానికి చెందిన యార మ‌ల్లారెడ్డి మరొక ఏడుగురు గుప్త నిధుల కోసం త‌వ్వ‌కాలు జ‌రుపుతుండ‌గా.. 1818వ సంవ‌త్స‌రం నాటి 30 రాగి నాణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. వాటిని విక్ర‌యించేందుకు వెళ్లుతుండగా వారిని పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిన‌దే.

ఈ తవ్వ‌కాల్లో పెద్ద ఎత్తున బంగారు బిళ్ల‌లు దొరికిన‌ట్టు గీసుకొండ‌కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు మాట్లాడుకుంటున్న ఆడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 2021 డిసెంబ‌ర్ 24న గుప్త నిదులు గుర్తించి బ‌య‌టికి తీసిన‌ట్టు వారి మాటల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. ముఖ్యంగా న‌లుగురు మిగ‌తా వారి క‌ళ్ల‌ను క‌ప్పి బంగారం పెట్టేను మాయ చేశారు. సుమారు 140 కిలోలు క‌లిగి బంగారం మూడు క్వింటాళ్ల వ‌ర‌కు ఉంటుంద‌ని వారు సంభాషించుకున్నారు. గుప్త‌నిధుల‌ను బ‌య‌టికి తీసేందుకు ఓ కోడేను బ‌లిచ్చేందుకు సిద్ధం అయ్యారు అని స్ప‌ష్టం చేసారు. కేవ‌లం రాగి నాణేలు మాత్ర‌మే ల‌భించాయ‌ని పోలీసులు చెబుతున్నారు. ఇందులో ఏది నిజ‌మో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version