నిన్నటి రోజు తగ్గి.. మళ్లీ పెరిగిన బంగారం ధర..!

-

బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతున్నాయి. మొన్నటివరకు పెరిగిన ధరలు నిన్నటి రోజు అమాంతంగా తగ్గాయి. మళ్లీ ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. దీంతో పసిడి ప్రియులకు నిరాశే మిగులుతోంది. బంగారం బాటలోని వెండి కూడా నడుస్తోంది. దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరగడంతో ధర రూ.41,800కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరగడంతో ధర రూ.45,600కి చేరింది.

బంగారం
బంగారం

10 గ్రాముల బంగారం ధర..
రాష్ట్రాల వ్యాప్తంగా బంగారం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. చెన్నై పట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,980కి చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,430 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,430కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,950కి చేరింది. కోల్‌కతా పట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,790కి చేరింది. బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,600 గా ఉంది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,600కి చేరింది. హైదరాబాద్‌లో కొనసాగిన ధరలే విజయవాడ, విశాఖపట్నంలో కొనసాగాయి.

వెండి ధర.. కేజీల్లో
బంగారం ధరతోపాటు వెండి ధర కూడా పెరుగుతూ వస్తోంది. గత నాలుగు రోజులుగా వెండి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధరకు రూ.300 పెరగడంతో ధర రూ.71,400కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కేజీకి రూ.300 పెరగడంతో రూ.67,000కి చేరింది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.71,400, ముంబైలో ధర రూ.67,000గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news