గుడ్ న్యూస్; దేశంలో కరోనా ఆగిపోయింది…?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టినట్టేనా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. దేశంలో కరోనా కేసులు ఇప్పుడు 5 వేలు దాటాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వాళ్ళు చాలా మంది బయటకు వస్తున్నారు. ఎవరికి కరోనా లక్షణాలు లేకపోవడం తో ప్రభుత్వాలు వారిని బయటకు పంపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది బయటకు వచ్చారు.

తెలంగాణాలో దాదాపుగా ఎవరూ క్వారంటైన్ లో లేరు. ఇక రోజు రోజుకి కేసులు తగ్గే అవకాశాలే తెలంగాణాలో కనపడుతున్నాయి. ఇప్పుడు శాంపిల్స్ ని తీసుకున్నారు. లక్షణాలతో ఎవరూ కూడా ఇప్పుడు ఆస్పత్రులకు అసలు రావడం లేదు కూడా. అందుకే ఇప్పుడు కేసులు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్న వాళ్ళే గాని బయట నుంచి ఎవరూ కూడా సెంటర్లకు వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి.

మహారాష్ట్ర, తమిళనాడు లో మాత్రమే పరిస్థితి కాస్త ఆందోళనగా ఉన్నా… తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాలా కట్టడిగా ఉందని రాబోయే రోజుల్లో ఇక్కడ కేసులు భారీగా తగ్గుతాయని అంటున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా తగ్గితే మాత్రం లాక్ డౌన్ ని సడలించే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. రాబోయే రెండు వారాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్ధమవుతుంది.