ఏపీ ఉద్యోగులకు శుభవార్త..జీతాలపై సర్కార్‌ కీలక ఆదేశాలు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగులకు జగన్‌ మోహన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. కొత్త పే స్కేల్స్ అమలు చేయాలని మరోసారి సర్కులర్ జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ. జనవరి నెల జీతాలను కొత్త పీఆర్సీ ప్రతారం చెల్లించేలా బిల్లులు తయారు చేయాలని మళ్లీ స్పష్టం చేస్తూ ట్రెజరీలకు.. డీడీఓలకు ఆదేశాలు జారీ చేసింది ఆర్థిక శాఖ.

ఉద్యోగుల సర్వీసు రిజిస్టరును అనుసరించి 2018 జులై 1 తేదీ నుంచి 2021 డిసెంబర్ 31 తేదీ వరకు గణించి కొత్తగా రూపొందించిన సాఫ్ట్ వేర్ మాడ్యూల్ లో బిల్లులు అప్లోడ్ చేయాలని సూచనలు చేసింది. జనవరి 25 తేదీలోగా ఈ ప్రక్రియ ను అంతా పూర్తి చేయాలని.. డీడీఓలకు కొత్త పే రోల్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్‌. ఇచ్చిన ఆదేశాల్లో ఏమాత్రం మార్పులు లేకుండా కొత్త వేతన స్కేళ్ల ను అమలు చేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చారు ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్. కాగా.. ఏపీ సర్కార్‌ పీఆర్సీపై వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news