చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది : కొడాలి నాని సంచలనం

చంద్రబాబుపై మరోసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం నడుస్తుందని నిప్పులు చెరిగారు కొడాలి నాని. తన కల్యాణ మండపం దగ్గర సీసీ కెమెరాలున్నాయని… సీసీ ఫుటేజ్‌ని నేనే మీడియాకు విడుదల చేస్తానని ప్రకటన చేశారు. కాసినో, జూదం జరగలేదని నిరూపిస్తానని.. చంద్రబాబు, ఆయన కుల మీడియా ఎన్ని కుట్రలు చేసినా నన్నేమీ చేయలేరని స్పష్టం చేశారు కొడాలి నాని. గుడివాడలో కాసినోలు, జూదాలు జరిగాయని చంద్రబాబు కుల మీడియాలో అబద్ధపు వార్తలు రాశారని… దానిపై నిజనిర్థారణ కమిటీ వేసి, బోండా ఉమాను పంపించారని మండిపడ్డారు.

అక్కడి ప్రజలే వారిపై తిరగబడి ఏం శాస్తి చేశారో అనుభవపూర్వకంగా చూశారరన్నారు. కాసినోలు జరిగాయని ఆరోపణలు చేసింది చంద్రబాబు, ఆయన కుల మీడియా అని.. కమిటీ వేసింది చంద్రబాబు… మా కులానికి, మా కుల మీడియాకు వ్యతిరేకంగా చంద్రబాబును కాదని, సీఎం వైఎస్‌ జగన్‌కు మద్దతు తెలుపుతున్నానని వీళ్లంతా ఏకమై నాపై నిందలు వేస్తున్నారని కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. ఎక్కడో తీసిన విజువల్స్, ఫొటోలను తీసుకొచ్చి నా కల్యాణ మండపంలో జరిగినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.