అర్హులై సంక్షేమ పథకాలు అందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. అర్హులై వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేక పోయిన వారికి లబ్ది చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అర్హులై పథకాలు పొందలేక పోతున్న వారి కోసం తాజాగా మరోసారి దరఖాస్తుల పరిశీలన చేయాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏటా జూన్, డిసెంబర్ లలో సంక్షేమ పథకాల లబ్ధి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
అర్హులై సంక్షేమ పథకాలు అందని వారికి అన్నీ పథకాలు అందేలా చూడాలని పేర్కొన్నారు. ఇక ఇవాళ 9,30,809 మంది అర్హులైన లబ్ధిదారులకు 703 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి వివిధ పథకాల కింద జమ చేయనున్నారు సీఎం వైయస్.జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో నిధుల జమ చేయనున్నారు. అదనంగా 3,44,497 మందికి పెన్షన్ కార్డులు, 3,07,599 మందికి బియ్యం కార్డులు అందించనున్నారు. మొత్తంగా 18,48,596 మందికి ప్రయోజనాలు అందించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.