ఏపీ ప్రజలకు శుభవార్త. ఉపాధిహామీ పనులపై కీలక ప్రకటన చేశారు సిఎం జగన్ మోహన్ రెడ్డి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపాధిహామీ పనులను ముమ్మరంగా చేసేందుకు అవకాశం ఉంటుందని… నిర్దేశించుకున్న లక్ష్యంలో కనీసం 60 శాతం పనులను ఈ మూడు నెలల్లోనే పూర్తి చేసేలా కలెక్టర్లు దృష్టి సారించాలని ఆదేశించారు సిఎం వైఎస్ జగన్.
కలెక్టర్లు, జేసీలు సచివాలయాలకు వెళ్లినప్పుడు వచ్చే నెలలో పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ చేశారా.. లేదా? అన్నది పరిశీలించాలని కోరారు. అంతకు ముందు నెలలో అమలైన పథకానికి సంబంధించి మిగిలిపోయిన అర్హులు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించారు వైఎస్ జగన్.
డిసెంబర్ నాటికి 4,545 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తి కావాలి. అదే సమయానికి ఇంటర్నెట్ కేబుల్ కూడా సంబంధిత గ్రామాలకు సమకూరుతుంది. తద్వారా గ్రామాల్లోనే వర్క్‌ఫ్రం హోమ్ అందుబాటులోకి వస్తుందన్నారు వైఎస్ జగన్.