Dhanush: హాలీవుడ్ ఫిల్మ్‌లో అబ్బురపరస్తున్న ధనుష్..‘ది గ్రే మ్యాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్

-

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్..తమిళ్ భాషలోనే కాదు ఇతర భాషల్లోనూ సత్తా చాటుకుంటున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్స్ లో కీ రోల్ ప్లే చేసి చక్కటి పేరు సంపాదించుకున్న ఈ యంగ్ హీరో..ప్రస్తుతం టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ పిక్చర్ తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది.

హిందీ ఫిల్మ్ ‘అత్రంగి రే’లోనూ ధనుష్ చక్కటి నటన కనబర్చాడు. హాలీవుడ్ ఫిల్మ్ లోనూ ధనుష్ నటిస్తున్నాడు. ఆ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు ధనుష్.

‘కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్’, ‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’, ‘ఎండ్‌క్యామ్’, ‘సివిల్ వార్’ ఫిల్మ్స్ ను డైరెక్ట్ చేసిన ఆంథోనీ రూసో, జో రూసో దర్శకత్వంలో రాబోయే హాలీవుడ్ పిక్చర్ ‘‘ది గ్రే మ్యాన్’’. ఇందులో ధనుష్ కీలక పాత్ర పోషించారు.

ఈ పిక్చర్ లోని ధనుష్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. అందులో ధనుష్..మాస్ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో ఉన్నాడు. ఓ కారుపైన నిలబడి ఉన్న ధనుష్..వెరీ డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతున్నది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ పిక్చర్ ఈ ఏడాది జూలై 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీడీలో విడుదల చేయనున్నట్లు ధనుష్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news