పాడి పరిశ్రమలో సిరులు కురిపించే 5 గేదె జాతులు ఇవే !

-

భారతదేశంలో..వ్యవసాయం తర్వాత రైతులు ఎంచుకునేది పాడిపరిశ్రమే. ఎంతోమందికి ఇదే జీవినధారం.. మనదేశంలో.. సుమారు 26 జాతుల గేదలు ఉన్నాయి. అయితే ఇవన్నీ పెంచుకునేందుకు అనుకూలంగా లేవు. కేవలం 12 జాతుల గేదలను మాత్రమే.. పశువుల కాపరులు పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం.. వేరే రాష్ట్రాల నుంచి మేలు జాతి గేదలను దిగుమతి చేసుకుంటారు. భారత్ లో ఎక్కువ భాగం.. ఉత్తరప్రదేశ్ లోనే గేదలు ఉంటాయట. అయితే.. పాడిపరిశ్రమ బిజినెస్ పెట్టాలనుకుంటే.. గేదల కొనుగోలులో అధికంగా పాల దిగుబడిని ఇచ్చే గేదలు ఎక్కడ దొరుకుతాయి, అ‌వి ఏ జాతికి చెందివనే తెలుసుకుంటే.. కొంచెం కష్టమైన అవి కానీ తెచ్చుకుని పాడిపరిశ్రమ పెడితే.. లాభాలే లాభాలు.. ఇంకెందుకు ఆలస్యం.. ఆ జాతి గేదెలు ఏవో చూద్దామా..!

1. ముర్రా (Murra Buffalo )

గేదెలలో, ముర్రా జాతి గేదెలు నెంబర్ వన్ గేదలు.. ఈ గేదె అత్యధిక పాలు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సగటు ఉత్పత్తి సామర్థ్యం నెలకు 1750 నుంచి 1850 లీటర్ల వరకు ఉంటుందంటే మీరే ఆలోచించండి… అంతే కాదు, ముర్రా గేదె పాలలో సుమారు 9 శాతం కొవ్వు ఉంటుంది .
ముర్రా జాతికి చెందిన గేదె పొడవుగా, వెడల్పుగా మరియు చక్కటి శరీరాకృతితో ఉంటుంది. ఇది భారతదేశంలోని హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో ఎక్కువగా పెంచుతారు.

2. పండర్ పురి గేదె((Pandharpuri Buffalo)

మహారాష్ట్రలోని సోలాపూర్, కొల్హాపూర్, రత్నగిరి జిల్లాల్లో ఈ జాతికి చెందిన గేదెలు దొరుకుతాయి. . ఇది నెలకు సుమారు 1700 నుంచి 1800 వరకు పాలు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని పాలలో 8 శాతం వరకు కొవ్వు ఉంటుంది. ఈ జాతి గేదలు కనిపించడంలో చాలా అందంగా ఉంటుంది. దీని కొమ్ములు 45 నుంచి 50 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. బరువు సుమారు 450 నుంచి 470 కిలోల వరకూ ఉంటుంది.

3. సుర్తి గేదె (surti buffalo)

ఈ జాతికి చెందిన గేదెను గుజరాత్ కు చెందిన పశువుల కాపరులు అధికంగా పెంచుతారు. దీని పాలు ఉత్పత్తి సామర్థ్యం నెలకు 900 నుంచి 1300 లీటర్లు, పాలల్లో 8 నుంచి 12 శాతం కొవ్వు ఉంటుంది.w

4.చిల్కా బఫెలో (chilak buffalo)

చిల్కా జాతికి చెందిన గేదె ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది. ఇది నెలకు సుమారు 500 నుంచి 600 లీటర్ల పాలు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ గేదె రంగు గోధుమ, నలుపు వర్ణంలో ఉంటుంది.

5. మెహ్సానా బఫెలో (Mehsana Buffalo)

ఈ జాతికి చెందిన గేదెలు గుజరాత్, మహారాష్ట్రలలో ఎక్కువగా కనిపిస్తాయి. సగటు పాలు ఉత్పత్తి సామర్థ్యం నెలకు 1200 నుంచి 1500 లీటర్లు. ఈ జాతి గేదలు కూడా ముర్రా లాగా కనిపిస్తుంది. కానీ ఇది ముర్రా గేదెలా బరువు ఉండదు, ఇది బరువు తక్కువగా ఉంటుంది. ఇది 560 నుండి 480 కిలోల వరకు ఉంటుంది. నలుపు రంగులో ఉంటుంది.
పాడిపరిశ్రమ పెట్టాలనుకునే రైతులు.. ఈ రాష్ట్రాల్లో.. గేదలను ఒక్కొక్కటిగా దిగుమతి చేసుకుని శాంపిల్ చూసుకున్నా.. మంచి ఫలితాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news