కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఒకేసారి రెండు గుడ్ న్యూస్ లను చెప్పడం విశేషం.. ప్రతి సంవత్సరం రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరుగుతుందన్న విషయం తెలిసిందే.. ఒకటి జనవరిలో రెండోది జూలైలో..ఈ రెండు డీఏలు ప్రతి సంవత్సరం పెరుగుతాయి. తద్వారా ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. ఇప్పటికే జనవరి 2023 కు సంబంధించిన డీఏ పెరిగింది. మార్చిలో పెరిగినా.. జనవరి 2023 నుంచే అది అమలులోకి వచ్చింది..

 

జులై 2023 లో పెరగాల్సిన డీఏ పెంపుపై కూడా త్వరలో ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. డీఏ పెంపుతో పాటు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై కూడా త్వరలోనే శుభవార్త వచ్చే చాన్స్ ఉంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను కూడా కేంద్రం పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీని వల్ల ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ద్వారా బేసిక్ వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేల వరకు పెరుగుతుంది. డీఏ పెంపు, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై కేంద్రం ఒకేసారి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది..

ఇప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉంది. డీఏ మొన్న మార్చిలో పెరిగిన 4 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే 42 శాతం పెరిగింది. అది జనవరి 1, 2023 నుంచి అమలులోకి వచ్చింది. 2023 జులైలో డీఏ 4 శాతం పెరిగితే 42 నుంచి డీఏ 46 శాతానికి పెరిగే చాన్స్ ఉంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. వీటితో పాటు కోవిడ్ సమయంలో పెండింగ్ లో ఉన్న 18 నెలల డీఏ బకాయిలు కూడా రావాల్సి ఉంది.. ఇకపోతే ఈ ఏడో వేతనానికి బదులుగా ఎనిమిదో కమీషన్ పే ను అమలు చెయ్యనున్నట్లు సమాచారం..

Read more RELATED
Recommended to you

Latest news