ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 11వ పీఆర్సీ నివేదిక ను రాష్ట్ర ప్రభుత్వం విడుతల చేసింది. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అశుతోష్ మిశ్ర కమిటీ ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఫిట్ మెంట్ సిఫారసు చేసినట్టు ప్రకటించింది. కాగ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ ను తగ్గించకుండా, సీఏఏ ను కొనసాగిస్తూ పీఆర్సీని విడుదల చేసింది.
కాగ వీటితో ప్రభుత్వ ఉద్యోగులకు పాటు మరి కొన్ని వెసులు బాట్లు, ప్రయోజనాలు కల్పిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పై ప్రతి సంవత్సరానికి రూ. 3,181 కోట్ల భారం పడే అవకాశం ఉందని ఆశుతోష్ మిశ్ర కమిటీ తెలిపింది. కాగ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఒక సారి పీఆర్సీని విడుదల చేసింది. కాగ ఈ పీఆర్సీతో తాము తీవ్రంగా నష్ట పోతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమా బాట పట్టారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె కు కూడా దిగారు. దీంతో ఉద్యో సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు చర్చలు జరిపారు.
ఈ చర్చల్లో ఉద్యోగులకు కొంత వరకు మేలు కలిగించేలా పీఆర్సీ ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగ తాజా గా విడుదల చేసిన 11 వ పీఆర్సీ నివేదిక పూర్తి వివరాలు సీఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది.