ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శాలరీ లిమిట్‌ను పెంచాలనే అనుకుంటోంది. దీనితో ఉద్యోగులకి తీపికబురుని చెప్పనుంది. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచాలని అనుకుంటోంది. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తోందని తెలియజేసింది. రానున్న రోజుల్లో అమలు చేయొచ్చని అంటున్నారు.
ఒకవేళ కనుక ఇది జరిగితే చాలా మందికి ప్రయోజనం కలుగుతుంది. దాదాపు 75 లక్షల మంది వర్కర్లు లబ్ధి పొందొచ్చు. ఒకవేళ కనుక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ దీనికి ఒప్పుకుంటే కంపెనీలు ఈ భారాన్ని మోయడానికి సిద్ధంగానే ఉన్నాయని సీనియర్ గవర్నమెంట్ ఉద్యోగి ఒకరన్నారు. కరోనా వైరస్ కారణంగా వ్యయాలు పెరిగిపోయాయని అందువల్ల పరిమితి పెంపు ప్రతిపాదన అమలుకు కొంత కాలం గడువు కోరుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌కు ఏటా రూ. 6750 కోట్లు చెల్లిస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు, ఈపీఎఫ్ సభ్యుడిగా రిజిస్టర్ అయితే అప్పుడు ఆటోమేటిక్‌గానే ఈపీఎస్ సబ్‌స్క్రైబర్‌గా మారచ్చు. ఉద్యోగి శాలరీ లో 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ అవుతూ వస్తుంది. ఇదే మొత్తాన్ని కంపెనీ కూడా సబ్‌స్క్రైబర్ ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఇందులో 8.33 శాతం ఈపీఎస్‌కు వెళ్తుంది. ప్రస్తుతం గరిష్ట పెన్షనబుల్ శాలరీ రూ.15 వేలుగా ఉంది.
ప్రతి నెలా గరిష్ట పెన్షన్ వాటా రూ.1250. ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ లెక్కింపునకు గరిష్ట శాలరీగా రూ.15 వేలను తీసుకుంటారు. గరిష్ట పెన్షన్ రూ.7500 అవుతుంది. ఇది ఇలా ఉంటే ఒక కంపెనీలో 20 కన్నా ఎక్కువ మంది ఉద్యోగుల ఉంటే ఆ కంపెనీ కచ్చితంగా ఈపీఎఫ్‌వో కింద రిజిస్టర్ చేసుకోవాలి. ఈ లిమిట్ 10కి తగ్గించాలనే డిమాండ్ ఉంది. కాగా రూ.15 వేలలోపు మూల వేతనం ఉన్న వారికి ఈపీఎఫ్ కచ్చితం.