ఇప్పటికే చాలా మంది రైతులు పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారు. ఆర్ధిక ఇబ్బందులు తగ్గుతాయి. అయితే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన (PMKSNY) పథకం కింద ఇప్పటికి పదకొండు విడతల డబ్బులు పడ్డాయి.
ఇప్పుడు పన్నెండవ విడత డబ్బులు అందాలి. పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు లభిస్తాయి. ఇవి రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అన్నదాతలకు వస్తాయి. ఇలా ప్రతీ ఏడాది డబ్బులు వస్తూ ఉంటాయి. అయితే ఈ పన్నెండవ విడత డబ్బులను దీపావళి కన్నా ముందుగానే అన్నదాతలకు వస్తాయట.
పూర్తి వివరాలను చూస్తే.. పీఎం కిసాన్ 12వ విడత డబ్బులను కేంద్రం దీపావళి కన్నా ముందే జమ చేయనుంది. మీడియా నివేదికలను చూస్తే.. అక్టోబర్ 17, 18 తేదీల్లో ఈ డబ్బులు జమ అవుతాయని తెలుస్తోంది.
అగ్రి స్టార్టప్ కాంక్లేవ్ అండ్ కిసాన్ సమ్మేళన్ 2022 సందర్భంగా రూ.2 వేల డబ్బులను విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2 వేలు రైతుల యొక్క ఖాతాలో నేరుగా జమ అవుతాయి. కనుక అన్నదాతలు కచ్చతంగా ఇకేవైసీ చేసుకొని ఉండాలి. లేదంటే ఈ డబ్బులు రావు గుర్తు పెట్టుకోండి.
ఇక ఇదిలా ఉంటే ఒకవేళ కనుక డబ్బు అందని వారు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్ 011 24300606 /011 23381092 కు నేరుగా డయల్ చెయ్యచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు, PM కిసాన్ హెల్ప్ డెస్క్ (PM KISAN హెల్ప్ డెస్క్) pmkisan [email protected] మెయిల్ ద్వారా సంప్రదించ వచ్చు. ఇలా సమస్య చెప్పి డబ్బులు పొందే అవకాశం వుంది.