రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

-

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తమ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  అందుకే ప్రభుత్వం ఏ రోజూ వేలంలో పాల్గొనలేదని చెప్పారు.  నేడు కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ కొడుతుందని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని, కానీ బీఆర్ఎస్ వ్యతిరేకించడంతో ఇప్పటిదాకా అక్కడ నుంచి ఒక తట్టెడు బొగ్గు కూడా ఆ కంపెనీలు ఎత్తలేదని తెలిపారు.

వేలంలో గనులను దక్కించుకున్న రెండు కంపెనీలు కేవలం బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ప్రయోజనాల కోసం నిలబడడంతోనే మైనింగ్ ప్రారంభించలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ.. గనులను కేటాయించినా, కేవలం రాష్ట్ర ప్రభుత్వ కఠిన వైఖరి, నిబద్ధత వల్లనే ఆ కంపెనీలు సింగరేణి బొగ్గును తవ్వలేకపోయాయని చెప్పారు. ఆ పూర్తి క్రెడిట్ బీఆర్ఎస్‌కు దక్కుతుందన్నారు. కానీ రేవంత్ పేర్కొన్న ఆ రెండు కంపెనీలు మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టాక్లి, జెన, బెల్లోర గనులను దక్కించుకున్న విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news