ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 2 మార్కులు కలపనున్న బోర్డు..

-

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఏపీ ఇంటర్ బోర్డ్. ఏపీలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా సోమవారం సెకండ్ ఇయర్ భౌతిక శాస్త్రం పరీక్ష జరిగింది. తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో మూడో ప్రశ్నగా అయస్కాంత అవపాతం ను నిర్వచించుము ? అని రాగా… అదే ఇంగ్లీష్ మీడియం ప్రశ్నాపత్రంలో డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లే నేషన్ అని తప్పుగా ప్రచూరితమైంది.

దానికి బదులుగా డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇన్ క్లీనేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డీప్ అని రావాల్సి ఉంది. దీనికి పరీక్ష కేంద్రాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు సందేశాలు పంపించారు. దీనిపై ఇంటర్మీడియట్ బోర్డు కూడా స్పందించింది. ప్రశ్న తప్పుగా రావడానికి పరిగణలోకి తీసుకుని.. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం భౌతికశాస్త్రం పరీక్షలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు రెండు మార్కులు కల్పనున్నట్లు ప్రకటన చేసింది ఇంటర్ బోర్డు. ప్రశ్నాపత్రంలోని మూడవ ప్రశ్నకు జవాబు రాసినా, రాయకపోయినా రెండు మార్కులు కలపాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version