మహిళలకు గుడ్ న్యూస్.. లిప్ స్టిక్ ధరలు భారీగా తగ్గనున్నాయి..ప్రపంచంలోని కాస్మోటిక్స్ కంపెనీలలో ఒకటైన రెవ్లాన్ ఇంక్ పరిస్థితి దారుణంగా పడిపోయింది.. రేపో, మాపొ ఆ కంపెనీ షేర్లు దివాల తీసేవాళ్లు..వచ్చే వారంలోనే కంపెనీ దివాలా అప్లికేషన్ దాఖలు చేయనుందని తెలిసింది. దీంతో రెవ్లాన్ కంపెనీ షేర్లు అమెరికా మార్కెట్లో శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. ఏకంగా ఒక్క రోజే 53 శాతం మేర రెవ్లాన్ షేర్లు కుప్పకూలాయి..
ఓ నివేదిక ప్రకారం మార్చి నాటికి కంపెనీ అప్పులు 3.31 బిలియన్ డాలర్లకు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.25,865 కోట్లకు పెరిగినట్టు తెలిసింది.కరోనా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మేకప్ ప్రొడక్టులకు డిమాండ్ బాగా పెరిగింది. కానీ ఇతర బ్రాండ్ల నుంచి వస్తోన్న పోటీని రెవ్లాన్ తట్టుకోలేకపోతుంది. ముఖ్యంగా డిజిటల్ బ్రాండ్ల పోటీని ఈ కంపెనీ తట్టుకోలేకపోతుంది. అంతేకాక కంపెనీ తమ కాస్మోటిక్స్ ప్రొడక్టులకు వచ్చే డిమాండ్‌ను కూడా అందుకోలేక సతమతమవుతుంది.కొన్ని ముఖ్య కారణాల వల్ల కంపెనీ పరిస్థితి దారుణంగా కిందకు పడిపోయింది.
రెవ్లాన్ దివాలా పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతుందనే విషయాన్ని తొలిసారి రీఆర్గ్ రీసెర్చ్ రిపోర్టు చేసింది.రెవ్లాన్ దివాలా అప్లికేషన్‌పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ వార్తలు వెలువడిన కొద్ది సేపట్లోనే కంపెనీ షేర్లు 53 శాతం వరకు పడిపోయాయి. కంపెనీ స్టాక్ గ్లోబల్ మార్కెట్లో 2.05 డాలర్ల వద్ద ముగిసింది. రెవ్లాన్ కంపెనీ 50 రకాల బ్రాండ్లను విక్రయిస్తోంది.150కి పైగా దేశాలలో ఉన్నాయి. 90 ఏళ్ల క్రితం ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. రెవ్లాన్ ఓనర్ మ్యాక్ఆండ్రూస్ అండ్ ఫోర్బ్స్.కరోనా కన్నా ముందు కూడా అదే పరిస్థితి నెలకొంది..దాంతో ధరలు పూర్తిగా పడి పోయాయని అంటున్నారు. కొద్ది రోజుల్లో ధరలు ఇంకాస్త కిందకు దిగి వస్తాయని అంటున్నారు. ఈ వార్త మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.