ఆ తెగలో మహిళలు జీవితంలో ఒక్కసారే స్నానం చేస్తారట!

-

రోజు స్నానం చేసినా.. ఈ సమ్మర్‌కు చిర్రెత్తిపోతుంది. మాములుగా మనం స్నానం చేయకుండా ఒక్కరోజు కంటే ఎక్కువ ఉండలేం కదా.. ఏదో జోక్‌గా స్నానం చేసి వారం అయిందని చెప్పుకుంటారే కానీ.. అసలు వారం రోజుల పాటు స్నానం చేయకపోతే… ఆ కంపు మాములుగా రాదుగా.. కానీ మీకు తెలుసా.. ప్రపంచంలో ఓ ప్రత్యేక తెగకు చెందిన మహిళలు జీవిత కాలంలో ఒకే ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తారట. అంతేకాదు ఈ తెగకు చెందిన పురుషులు తమకు పెళ్లి అయింది అని పదిమందికి తెలిసేలా వివాహ చిహ్నం ధరిస్తారట. ఇదేదో తేడాగా ఉందే.. ఏంటి తెగ.. ఎక్కడుందో చూద్దామా..!

ఈ తెగను హింబా తెగ అంటారు. ఆఫ్రికాలోని ఈశాన్య నమీబియాలోని కునైన్ ప్రావిన్స్‌లో వీరు ఉంటారు. ఈ తెగ మహిళలు పెళ్లి చేసుకున్నప్పుడే స్నానం చేస్తారట. ఇలా పెళ్లి చేసుకునే సమయంలో స్నానం చేయడం తప్ప.. ఇతర సమయాల్లో మహిళలు నీటిని ఉపయోగించడం నిషేధం. ఇక్కడ బట్టలు ఉతకడం కూడా నిషేధమే.

మరి ప్రత్యామ్నాయం ఏంటి.?

ఈ తెగకు చెందిన స్త్రీలు తమ జీవితంలో ఒక్కసారే స్నానం చేస్తారు కాబట్టి… ఈ తెగ మహిళలు తమను తాము తాజాగా ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ప్రత్యేక మూలికలను నీటిలో వేసి మరిగిస్తారు. అప్పుడు వచ్చే నీటి ఆవిరితో శరీరాన్ని తాజాగా ఉంచుకుంటారట. తద్వారా శరీరం నుంచి ఎలాంటి దుర్వాసన రాదని చెబుతారు.

ఇక్కడ స్త్రీలు కాకుండా పురుషులు వివాహ చిహ్నాన్ని ధరిస్తారు. భారతదేశంలో పెళ్లయిన స్త్రీలు నుదిటిపై కుంకుమ, నల్లపూసలు, మేడలో తాళి ,మెట్టెలు ధరించడం అనాదిగా నడుస్తున్న ఆచారం.. అయితే మనదేశంలో పెళ్లి అయిన పురుషులకు ఎటువంటి నియమాలు లేవు.. కానీ హింబా తెగలో పెళ్లైన పురుషులు తలపై తలపాగా ధరిస్తారు. ఆ తలపాగాను ఎప్పుడూ తలమీద నుంచి తీయరట.

ఇది ఇంకో హైలెట్..

ఇక్కడ పిల్లల కోసం ఒక ప్రత్యేక పాటను సిద్ధం చేస్తారు. పుట్టబోయే పిల్లలను తల్చుకుంటూ.. స్త్రీలు చెట్టుకింద కూర్చుని బిడ్డకు జన్మనివ్వడానికి.. అందుకోసం ఒక పాట గురించి ఆలోచిస్తారు. ఆ పాట తన మనసులోకి వచ్చిన వెంటనే.. ఆ పాట గురించి ఆ మహిళ తన భర్తకు చెబుతుంది. అప్పుడు ఇద్దరూ శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుంటారట. స్త్రీ గర్భవతి అయినప్పుడు, ఆ పాటను ఇతరులకు కూడా చెబుతారు. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ పాటను గుర్తుంచుకుంటారు. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆ పాటే అతడి గుర్తింపు.. పేరుకు బదులుగా.. ఆ పాట ద్వారానే ఆ బిడ్డను గుర్తిస్తారన్నమాట ఈ హీంబా తెగవారు. అంతా వెరైటీగా ఉంది కదూ.. వీటన్నింటికి వారికి సంబంధించి ఏవో కారణాలు ఉండే ఉంటాయి.!

Read more RELATED
Recommended to you

Latest news