సీనియర్ సిటిజన్‌లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. బస్సుల్లో టికెట్లపై తగ్గింపు..!

-

సీనియర్ సిటిజన్‌లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వారికి ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీని ఇస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. ఈ రూల్ నేటి నుండి అమలులోకి రానుంది. దీనిపై ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ఈడీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

కరోనా కారణంగా ప్రభుత్వం 2020 మే 21 నుంచి ఈ రాయితీని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా అదుపులోకి రావడంతో మళ్లీ రాయితీని తీసుకొచ్చింది సర్కార్. ఈ రాయితీని పొందాలి అంటే సీనియర్ సిటిజన్లు గుర్తింపు కార్డుల్ని చూపించాల్సి ఉంటుంది. ఏసీ సర్వీసులతో సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీల్లో సీనియర్ సిటిజెన్స్ రాయితీని పొందొచ్చు. అయితే వారు తప్పక ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డు వంటివి చూపించాల్సి ఉంటుంది.

సీనియర్ సిటిజన్లు ఈ రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఇది ఇలా ఉంటే త్వరలోనే బస్సుల్లో కూడా యూనిఫైడ్ టికెటింగ్ సిస్టం ని తీసుకు రానున్నారు. యూటీఎస్ కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. అభి బస్ సంస్థ టెండర్‌ను దక్కించుకుంది. డిజిటల్ పేమెంట్, లైవ్ లొకేషన్ వంటి ఫెసిలిటీస్ ని పొందొచ్చు.

మొట్టమొదటి సారిగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దీనిని తీసుకొచ్చారు. ప్రయాణికులు టికెట్ తీసుకున్న తర్వాత క్యాష్ కాకుండా డెబిట్, క్రెడిట్ కార్డులు, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పే చెయ్యచ్చు. టికెట్ల బుకింగ్‌లు, బస్‌పాస్‌లు, కొరియర్, పార్సిల్ బుకింగ్‌లు వంటివి కూడా చెయ్యచ్చు. మరో 6 నెలల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వస్తే టికెట్ బుకింగ్ ఈజీ అవుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news