పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు.. నేటి నుంచి అమ‌ల్లోకి

-

హైద‌రాబాద్ లో ఉన్న ఔట‌ర్ రింగ్ రోడ్డు పై టోల్ ఛార్జీలు పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిన టోల్ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వ‌చ్చాయి. టోల్ ఛార్జీలు పెర‌గ‌డంతో మంత్లీ పాస్ ల ఛార్జీలు కూడా భారీగానే పెరిగాయి. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రం చుట్టు దాదాపు 150 కిలో మీట‌ర్ల ప‌రిధిలో ఔట‌ర్ రింగ్ రోడ్డు విస్త‌రించి ఉంది. కాగ ఈ ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ప్ర‌యాణం చేయాలంటే.. టోల్ ఛార్జీలు త‌ప్ప‌నిస‌రిగా చెల్లించాలి.

ఈ టోల్ ఛార్జీల‌ను హెచ్ఎండీఏ లోని హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్.. టోల్ ఛార్జీల‌ను పెంచేసింది. టోల్ ఛార్జీల‌ను 3.5 శాతం నుంచి 5 శాతం వ‌ర‌కు హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పెంచిది. దీంతో ప్ర‌తి కీలో మీట‌ర్ కు 7 పైస‌ల నుంచి 53 పైస‌లు వ‌ర‌కు టోల్ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన టోల్ ఛార్జీలు నేటి నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. అయితే టోల్ ఛార్జీలు పెర‌గ‌డంతో నెల వారీ పాసుల ఛార్జీలు కూడా పెరిగాయి. ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఉన్న మొత్తం 19 ఇంట‌ర్ ఛేంజ్ ల వ‌ద్ద టోల్ ఛార్జీల‌ను వ‌సూల్ చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news