ఏపీ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నెన్నో పథకాలను అమలు చేస్తున్నారు.. అందులో విద్యా కానుక ఒకటి, మరోకటి అమ్మ ఒడి పథకాలు.. విద్యా కానుక కింద విద్యార్థులకు కావలసిన పుస్తకాలను, బ్యాగ్స్, తదితర వస్తువులను అందజేస్తున్నారు.ఇక అమ్మ ఒడి పథకంలో విద్యార్థులకు 15 వేల నగదును అంద చేస్తున్నారు.
ఈ పథకం ద్వారా ఇప్పటికే రెండు విడతల డబ్బులు తల్లుల అకౌంట్లో జమ అయ్యాయి.ఇప్పుడు మూడో విడుత సాయాన్ని త్వరలోనే జమ చేయనున్నారు.. తాజాగా ఈ విషయం పై మరో అప్డేట్ ను అధికారులు తెలిపారు. ఈ నెల 27 న అమ్మ ఒడి డబ్బులను తల్లుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నారు..
శ్రీకాకుళం పర్యటన లో భాగంగా బటన్ నొక్కి సీఎం జగన్ మోహన్ రెడ్డి డబ్బులను విడుదల చేస్తారు.ఈ ఏడాదికి 41 లక్షల మంది ఈ సాయన్ని పొందనున్నారు..అయితే, ఈ జాబితాలో తమ పేర్లు లేవని చాలా మంది తల్లులు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు.కాగా, స్కూల్స్ నిర్వహణ 2 వేలు వుంచి, మిగిలిన నగదును 13 వేలను తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు.