తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2,440 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్…

-

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..కరోనా ప్రభావం వల్ల చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు మరణించారు.. వారి స్థానంలో కొత్త ఉద్యోగుల నియామకాలను చేపట్టనుంది.ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల భర్తీకి సర్కార్ జెండా ఊపింది. వీటి ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇది ఇలా వుండగా.. మరో నోటిఫికేషన్ ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.రాష్ట్రంలో మరో 2,440 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది..


ఇప్పటికే ఎన్నో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది..కొన్ని శాఖల్లోని వున్న ఖాళీలను కూడా పూర్తీ చేసింది. గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ ను కూడా ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ ఉద్యోగాలను విడుదల చేస్తూ వచ్చింది..ఇప్పుడు విడుదల అయిన నోటిఫికేషన్ పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఉద్యోగాలకు సంబందించిన పూర్తీ వివరాలు..

మొత్తం ఖాళీలు: 2,440

1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులు,
40 ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో లైబ్రేరియన్,
91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు,
ఆర్కైవ్స్ విభాగంలో 14 పోస్టులు,
పాలిటెక్నిక్ కళాశాలల్లో 247 లెక్చరర్,
14 ఇన్ స్ట్రక్టర్, 31 లైబ్రేరియన్,
5 మాట్రన్, 25 ఎలక్ట్రీషియన్,
37 పీడీ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.
కళాశాల విద్యావిభాగంలో 491 లెక్చరర్,
24 లైబ్రేరియన్,
29 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్థీ చేయనున్నారు..

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను కొద్ది రోజులలో ప్రకటించనున్నారు.. అందులో పూర్తీ సమాచారం అందించనున్నారు…ఉద్యోగాల భర్తీకి త్వరలోనే టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. టెట్ ఫలితాలు కూడా విడుదలైన నేపథ్యంలో టీచర్ ఉద్యోగాల భర్తీకి సైతం నోటిఫికేషన్లు త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news