డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగం..నెలకి లక్షకు పైగా జీతం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ నితెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ నియంత్రణలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ని విడుదల చేసారు.

ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాల్ని చూస్తే… తెలంగాణ లోని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ నియంత్రణలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు కొన్ని ఖాళీలు వున్నాయి. బీఎస్సీ (హార్టికల్చర్‌) ప్యాస్ అయినవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు. మొత్తం 22 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు జీతంగా ఇస్తారు.

ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే 01-07-2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. ఇదిలా ఉంటే 03-01-2023 నుండి దరఖాస్తు చేసుకోవడానికి అవుతుంది. 24-01-2023తో ఈ ప్రక్రియ క్లోజ్ అవుతుంది. పూర్తి వివరాలని https://websitenew.tspsc.gov.in/directRecruitment లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news