అర్రే..చేతులపై మెహెందీ మరకలు పోవడం లేదా..? ఇలా చేసేయండి..!!

-

ఆడవాళ్లకు ఏదైనా ఫంక్షన్‌ ఉందంటే.. డ్రస్‌లు, వాటికి మ్యాచింగ్‌ జ్యూలరీ సెట్‌ చేసుకోవడం పెద్ద టాస్క్.. ఇక ముందు రోజు మెహిందీ కూడా పెట్టుకుంటారు..గోరింటాకు పెట్టినప్పుడు అరిచేతులు భలే అందంగా ఉంటాయి కదా.. చాలామంది మెహిందీని మోచేతుల వరకూ పెట్టించుకుంటారు. ఇవి ఫంక్షన్‌రోజు బానే ఉంటాయి కానీ రెండు మూడు రోజులకు ఇక లైట్‌గా పోవడం స్టాట్‌ అవుతుంది. అప్పుడు చేయి చెండాలంగా కనిపిస్తుంది. అక్కడక్కడ మెహిందీ ఉండి లేక అదేదో ఎలర్జీ వచ్చినట్లే అనిపిస్తుంది. మనం మహా అయితే బాత్‌ సోప్‌తో తెగ రుద్దేస్తాం.. అయినా నో యూస్‌.. మీరు కూడా ఇంలాంటి సమస్యతో బాధపడుతుంటే.. మెహిందీ మరకలు పోవడానికి మంచి టిప్స్‌తో వచ్చాం.. అవేంటంటే..

యాంటీ బాక్టీరియల్ సబ్బుతో మీ చేతులను తరచుగా కడుక్కోవడం వల్ల దద్దుర్లు కొన్ని రోజుల్లో మాయమవుతాయి. చేతుల్లోని మరకలను తొలగించేందుకు ఉప్పు ఉత్తమమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది.. కాబట్టి రాళ్ల ఉప్పును నీళ్లలో కరిగించి అందులో చేతులను 15 నిమిషాల పాటు నానబెట్టి రుద్దితే మరకలు తొలగిపోతాయి. మరక పోయే వరకు ప్రతిరోజూ ఇలా చేయండి.

ఫేస్ స్క్రబ్బర్‌తో బాగా స్క్రబ్ చేయడం వల్ల కూడా చేతులపై మరక తొలగిపోతుంది. స్క్రబ్బింగ్ చేయడానికి ముందు, మీ చేతులను గోరువెచ్చని నీటిలో సుమారు 10 నిమిషాలు నానబెట్టి, ఆపై స్క్రబ్ చేయండి మంచి ఫలితం ఉంటుంది.

ఆలివ్ నూనెలో రాక్ ఉప్పును కరిగించి, మీ చేతులకు రాసుకోండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ చేతులను కడుక్కోండి. మెహందీ అవశేషాలను వదిలించుకోవడానికి చేతులను స్క్రబ్ క్రీమ్‌తో కడగండి.

నిమ్మరసం కూడా మెహందీ మరకలను తొలగిస్తుంది. కాబట్టి నిమ్మరసాన్ని నేరుగా చేతులకు రాసుకున్నా లేదా నీళ్లలో పిండుకుని అందులో 20 నిమిషాలు చేతులు పెట్టినా సరిపోతుంది.

బేకింగ్ సోడాలో సగం నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ లాగా మిక్స్ చేసి మెహందీ ఉన్న ప్రదేశాలలో ప్యాక్ లాగా అప్లై చేసి 10 నిమిషాల తర్వాత సబ్బుతో రబ్‌ చేసుకుని గోరువెచ్చని నీటితో చేతులు కడుక్కోవాలి. ఇక గోళ్లపై మెహందీ మరకలను తొలగించేందుకు నెయిల్ పాలిష్ రిమూవర్ సరిపోతుంది.

మీ చేతులపై కూడా మెహిందీ మరకలు ఉంటే.. వీటిలో ఏదో ఒక టిప్‌ ఫాలో అయిపోండి..!!

Read more RELATED
Recommended to you

Latest news