ఆ బ్యాంక్ నుండి రెండు శుభవార్తలు…!

-

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త సంవత్సరం కానుకగా కస్టమర్స్ కి రెండు శుభవార్తలని తీసుకు వచ్చింది. ఇక మరి దాని కోసం పూర్తి వివరాలని చూస్తే..

సేవింగ్స్ అకౌంట్లు సహా ఫిక్స్‌‌డ్ డిపాజిట్ అకౌంట్లపైన వడ్డీ రెట్లని పెంచింది బ్యాంకు. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్‌పై ఈ పెంపు వర్తిస్తుంది. సేవింగ్స్ అకౌంట్లపై 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు ని బ్యాంకు పెంచింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 50 బేసిస్ పాయింట్లను పెంచారు. FD టెన్యూర్‌ను బట్టి ఇవి ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ రూ.10 లక్షల లోపు ఉన్నట్టయితే వార్షిక వడ్డీ రేటు అత్యధికంగా 2.70 శాతంగా వుంది. రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల లోపు అయితే వడ్డీ రేటు అత్యధికంగా 2.70 శాతంగా వుంది.

ఒకవేళ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.100 కోట్లు లేదా దానికి మించి ఉంటే వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 2.75 శాతం వుంది. పెంచడంతో ఇది మూడు శాతానికి చేరింది. నుంచి 45 రోజుల్లో ముగిసే ఎఫ్‌డీలపై 3.50 శాతం వడ్డీ వస్తుంది. 46 నుంచి 179 రోజులకి అయితే 4.50 శాతం, 180 రోజుల నుంచి సంవత్సరంలోపు వాటికి 5.50 శాతం ఇస్తారు. సంవత్సరం నుంచి 665 రోజుల్లో వాటికి 45 బేసిస్ పాయింట్ల మేర పెంచారు. మొత్తం వడ్డీ రేటును 6.30 శాతం నుంచి 6.75 శాతానికి పెంచేసింది బ్యాంకు.

 

Read more RELATED
Recommended to you

Latest news