పండుగల కంటే ముందే కేంద్రం ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పింది. దీనితో లక్షలాది మంది ఉద్యోగులకి ఊరట కలగనుంది. 78 రోజులకు సమానంగా బోనస్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. గత సంవత్సరం కూడా 78 రోజుల బోనస్‌ను ఇచ్చింది.
దాదాపు 11.27 లక్షల మంది ఉద్యోగులు లాభం పొందారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 11.27 లక్షల మంది ఉద్యోగులుకు ప్రయోజనం కలగనుంది. నాన్-గాడ్జెట్ రైల్వే ఉద్యోగులందరికీ ఈ బోనస్ వస్తుంది. పండుగ కి ఈ బోనస్ హెల్ప్ అవుతుంది. ఆర్థిక వ్యవస్థను మరింత పెంచడానికి కూడా అవుతుంది.
దేశ ఆర్థిక వ్యవస్థను సరిగా ఉంచేందుకు రైల్వే ఉద్యోగులు కృషి చేసారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెబుతూ.. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు రైల్వే ఉద్యోగులు చక్కగా పని చేసారని.. దేశ ఆర్థిక వ్యవస్థను సరిగా ఉంచేందుకు రైల్వే ఉద్యోగులు కృషి చేసారు అని అన్నారు.
బోనస్‌ను ఆమోదించినందుకు పీఎం నరేంద్ర మోడీ కి ట్విట్టర్ అకౌంట్ నుండి థాంక్స్ చెప్పారు. అయితే ఇలా బోనస్ ని ఇవ్వడం వలన రైల్వే ఉద్యోగుల కుటుంబాలకి ప్లస్ అవుతుంది. పండుగ సమయం కాబట్టి ఏదైనా కొనుగోలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది.