రైతు బజార్లలో పనిచేసే ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతు బజార్లలో ఒప్పంద పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను 23% పెంచుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విజయవాడ, విశాఖ, గుంటూరు రైతు బజార్లలో పనిచేసే ఎస్టేట్ అధికారులకు ఈ జీతాల పెంపు వర్తించనుంది. రైతు బజార్లలో పనిచేసే ఈ ఎస్టేట్ అధికారులకు 23 వేల రూపాయలు, సూపర్వైజర్లకు 18,500 రూపాయలు, సెక్యూరిటీ గార్డులకు 15 వేల రూపాయలు చొప్పున పెంచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక పట్టణాలలో పనిచేసే ఎస్టేట్ అధికారులకు 24 వేల రూపాయలు, సూపర్వైజర్లకు సెక్యూరిటీ గార్డులకు 15 వేల రూపాయలు చొప్పున పెంచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.