BREAKING NEWS: పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీ… వెల్లడించి రాహుల్ గాంధీ

-

5 రాష్ట్రాల ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ లో జరుగనున్న ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్స్ గా పరిగణిస్తున్నాయి రాజకీయ పార్టీలు.

ఇదిలా ఉంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పేరును వెల్లడించారు రాహుల్ గాంధీ.  రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత సీఎం చరన్ జీత్ సింగ్ చన్నీనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఖరారు చేశారు. లూథియానాలో జరుగుతున్న కాంగ్రెస్ కార్యక్రమంలోరాహుల్ గాంధీ వెల్లడించారు.

అయితే ముఖ్యమంత్రి స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నవజ్యోత్ సిద్దూకు మొండిచేయి చూపించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇటీవల ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఎప్పుడూ కూడా బలహీన సీఎంలనే కోరుకుంటుందని ఇటీవల సిద్దూ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రజలు నిర్ణయిస్తారు అధిష్టానం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే ఆప్ తన సీఎం అభ్యర్థిగా భగవంత్ సింగ్ మాన్ పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news