ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో శాసన మండలిని రద్దు చేస్తు తీర్మానం చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం… ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ మరో తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది ఏపీ ప్రభుత్వం.
ఈ మేరకు తీర్మానం ప్రతి పాదనను సభలో ప్రవేశ పెట్టారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. అమోదం అనంతరం ఉపసంహరణ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ సందర్బంగా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ… శాసన మండలి రద్దును వెనక్కి తీసుకుంటూ ఏపీ ప్రభుత్వం తీర్మానం తెలిసినట్లు ఆయన వివరించారు. మండలి రద్దు తర్వాత ఒక సందిగ్ధత ఉండిపోయిందని బుగ్గన వెల్లడించారు. సందిగ్దతను తొలగించేందుకు మండలిని కొనసాగించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారని బుగ్గన వెల్లడించారు.