గజ్వేల్ కు ఫారెస్ట్ యూనిర్శిటీ రాకుండా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అడ్డుకున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ప్రతినిధుల సభను మంగళవారంనాడు నిర్వహించారు. ఈ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టి రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ అభివృధి కి అడ్డుపడుతున్న గవర్నర్ ని తాను తెలంగాణ బిడ్డగా గట్టిగా ప్రశ్నిస్తున్నానని హరీష్ రావు చెప్పారు.
ఒక గులాబీ సైనికుడిగా ఉద్యమకారుడుగా తనకు మాట్లాడే హక్కు ఉందన్నారు హరీశ్. ఎక్కడైనా అభివృద్ధి అంటే దేశానికి సంపద రావాలి బయట దేశాల్లో ఉన్నవారు తిరిగి మన దేశానికి రావాలి కానీ.. ఇక్కడ రివర్స్ లో జరుగుతోందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పోకడ వల్ల దేశంలో ఉన్న సంపద బయట దేశాలకు తరలి పోతోందని… దేశంలోని పౌరులు బయట దేశాలకు వెళ్ళిపోతున్నారని విమర్శించారు.