వదిలిపెట్టం.. గ్యాంగ్ రేప్ ఘటనపై ఏపీ డీజీపీ సీరియస్

-

విజయవాడ: సీతానగరం కృష్ణానది ఒడ్డిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో యువతి‌పై జరిగిన ఘటన అత్యంత హేయం, బాధాకరమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే కృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్‌ల‌కు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఇటువంటి అమానవీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నేరానికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. మహిళల భద్రత తమ ప్రధమ కర్తవ్యమని చెప్పారు. ఎన్నో చర్యలు చేపట్టినా ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను ఖచ్చితంగా వాడేలా చర్యలు చేపట్టామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

మరోవైపు ఈ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, సీతానగరంలో రౌడీ షీటర్లను విచారిస్తున్నారు. సైకో లక్షణాలు ఉన్న రెండు గ్యాంగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాుల చేస్తున్నారు.

కాగా తాడేపల్లి మండలం సీతానగరం కృష్ణానది ఒడ్డున ఏకాంతంగా ఉన్న ప్రేమజంటపై కొందరు గుర్తు తెలియని యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువకుడిని కట్టేసి యువతిని లాక్కెళ్లి సాయూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున తాడేపల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. తన కూతురు కాబోయే భర్తతో కలిసి కృష్ణ నదిలోని పుష్కర ఘాట్ వద్దకు వెళ్ళిందని బాధితురాలి తల్లి తెలిపారు. బ్లేడ్ బ్యాచ్‌లోని ముగ్గురు ఆ జంటపై దాడి చేసి సామూహిక అత్యాచారం చేశారని చెప్పారు. తమ కుమార్తె ఫోన్ చేసి చెప్పటంతోనే తాము నది వద్దకు వెళ్ళామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news