Breaking : జీశాట్‌ 24 విజయవంతం..

-

ఇండియా రూపొందించిన లేటెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-24ను విజయవంతంగా ప్రయోగించారు. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌–5 రాకెట్‌ ద్వారా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌), కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌(డీఓఎస్‌) సంయుక్తంగా రూపాందించిన జీశాట్‌–24 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని బుధవారం వేకువజామున విజయవంతంగా రోదసీలోకి ప్రవేశపెట్టారు. 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్‌–24 ఉపగ్రహాన్ని నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చి డీటీహెచ్‌ అప్లికేషన్‌ అవసరాలను తీర్చేందుకు పాన్‌ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు.

NSIL's satellite for Tata Play, GSAT-24, launched by Arianespace | India  News - Times of India

ఇప్పటిదాకా 4వేల కిలోల పైన బరువు కలిగిన భారీ ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడంలో భాగంగా బుధవారం ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. జీశాట్‌–25తో డీటీహెచ్‌ అప్లికేషన్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

 

Read more RELATED
Recommended to you

Latest news