ఐపీఎల్ 2022 చాలా విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీలో 39 మ్యాచ్లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్ లు పూర్తి ఎంటర్ టైన్ చేశాయి. ఇవాళ 40 వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..
జట్ల అంచనా :
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (c), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ
సన్ రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (c), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (WK), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, T నటరాజన్