గులాబ్ జామ్ ని అనుమతించలేదని… ఆ వ్యక్తి ఆఖరికి ఇలా.. వీడియో వైరల్..!

కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో వీడియోలు విచిత్రంగా ఉంటాయి. వాటిని చూసి చాలా మంది అవాక్ అవుతూ ఉంటారు ఆ తరహాలోనే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ వీడియో లో ఏముంది..? అసలు ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం.

మామూలుగా ఎయిర్ పోర్ట్ కి వెళ్ళినప్పుడు ప్రయాణికులు అనుమతి లేని వస్తువులను ఏమైనా తెస్తే ఎయిర్ పోర్ట్ సిబ్బంది వాటిని తొలగిస్తూ ఉంటుంది సెక్యూరిటీ చెకింగ్ అయినప్పుడు అనుమతి లేని సామాన్లను తొలగిస్తుంటారు.

ముఖ్యంగా ఆహార పదార్థాలను ఏమైనా తెస్తే ఎయిర్ పోర్ట్ సిబ్బంది వెంటనే తొలగిస్తుంటారు. అయితే తాజాగా ఫుకట్ ఎయిర్ పోర్ట్ లో హిమాన్షు దేవగన్ కి అటువంటి సంఘటన ఎదురైంది. ఎయిర్ పోర్ట్ లో కి గులాబ్ జామ్ ని తీసుకువచ్చారు. కానీ నిజానికి ఎయిర్ పోర్ట్ సిబ్బంది వాటిని అనుమతించరు. వాటిని తీసుకు వెళ్ళ కూడదని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అడ్డుపడగా హిమాన్షు ఇలా చేశారు.

తాను తీసుకువచ్చిన స్వీట్ బాక్స్ ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న సిబ్బందికి పంచారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది వాటిని తిన్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు అనేది వీడియో తీసి పోస్ట్ చేశారు. ఆ సిబ్బంది రుచికరమైన గులాబ్ జామ్ ని టేస్ట్ చేసి ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు.

ఈ వీడియోని హిమాన్షు స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు హిమాన్షు చేసిన ఈ పనికి నెటిజన్లు అభినందిస్తున్నారు. ఆహారాన్ని అనవసరంగా వృధా చేయకుండా ఇలా పంచడం బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Himanshu Devgan (@himanshudevgan)