వావ్‌.. ఎడ్ల బండి తోలిన మంత్రి రోజా

ఏపీ ప‌ర్య‌ట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప‌ర్యాట‌క రంగానికి చెందిన కార్య‌క్ర‌మం జ‌రిగినా…వాటికి హాజ‌ర‌వుతున్న రోజా ఆయా కార్య‌క్ర‌మాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం తూర్పు గోదావ‌రి జిల్లా త‌ణుకులో జ‌రిగిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బ‌ల ప్ర‌ద‌ర్శ‌న కార్య‌క్ర‌మానికి ఆమె హాజ‌ర‌య్యారు.

Image

రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి వెంక‌ట నాగేశ్వ‌ర‌రావు త‌ణుకు ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కార‌మూరి నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలోనే ఈ ఎడ్ల బ‌ల ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతోంది. ఈ పోటీల‌కు హాజ‌రైన సంద‌ర్భంగా ఓ చేత ప‌గ్గాలు ప‌ట్టి, మ‌రో చేత చెర్నాకోల ప‌ట్టిన మంత్రి రోజా ఎడ్ల బండిని తొలుతూ ఉత్సాహంగా క‌నిపించారు.