గులాబ్ తడాఖా.. 13 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. సీఎం కేసీఆర్ సమీక్ష

-

తెలంగాణ వ్యాప్తంగా గులాబ్ ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీవ్రత కారణంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్ అలర్ట్ గా విభజించారు. సిరిసిల్ల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్ పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట, కరీంనగర్, జనగామ ఈ 13 జిల్లాలకు తీవ్ర ముప్పు ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరో 14 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దాదాపు తెలంగాణ అన్ని జిల్లాల్లో తెలికపాటి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీవ్రత,  కారు మబ్బుల కారణంగా హైదరాబాద్లో నగరంలో సాయంత్రమే చీకట్లు కమ్ముకున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ అక్కడ నుంచే గులాబ్ తుఫాన్ పై సీఎస్ సోమేష్ కుమార్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యల గురించి సీఎస్ సీఎం కేసీఆర్కు వివరించారు. జిల్లాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు సీఎం ద్రుష్టికి తీసుకోచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news