హైదరాబాద్ లో గన్ మిస్ ఫైర్ అయి.. ఓ కానిస్టేబుల్ మృతి చెందారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్ కావడంతో.. కానిస్టేబుల్ రామయ్య మృతి చెందారు. మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో సెక్యూరిటీగా ఉన్నారు రామయ్య. అయితే.. రోజు లాగే, తుపాకిని శుభ్రం చేస్తుండగా ఫైర్ అయి…కానిస్టేబుల్ రామయ్య మృతి చెందారు.
గన్ మిస్ ఫైర్ కావడంతో తీవ్ర గాయాలైన రామయ్యను ఆసుపత్రులు చేర్చారు అధికారులు. కానీ కానిస్టేబుల్ రామయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం నాంపల్లి కేర్ ఆస్పత్రిలో రామయ్య డెడ్‌బాడి ఉందని అధికారులు చెప్పారు. ఇక కానిస్టేబుల్ రామయ్యది మంచిర్యాల అని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.