గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ ఫైల్ తీసుకుని కారు ఎక్కుతుంది. రిషీ..అవన్నీ బ్యాక్ సీటులో పెట్టొచ్చుకదా అంటాడు. వసూ పర్లేదు అంటుంది. రిషీ సీట్ బెల్ట్ పెట్టమంటే..ఈ ఒక్కసారి వద్దులే అంటుంది వసూ..తప్పు అలా అనుకోకూడదు అని రిషీయే స్వయంగా సీట్ బెల్ట్ పెడతాడు. ఈ సీన్ లో రిషీని అంత దగ్గరనుంచి చూసిన వసూకి ఫీలింగ్ మొదలవుతుంది. దాహం వేస్తుంది సార్ అంటుంది. సడన్ గా ఇప్పుడేంటో అంటే..చేతిలో ఇవన్నీ ఉన్నాయికదా దాహం వేస్తే తాగకలనా అనుకున్నా వెంటనే దాహం మొదలైంది అంటుంది. రిషీ బాటిల్ ఇచ్చి తాగమంటే..వసూ తాగలేను సార్ అంటుంది. రిషీ తాగిస్తాడు..కట్ చేస్తే వసూ కల ఇది..రిషీ ఏం ఆలోచిస్తున్నావ్ అనే సరికి వసూ కలలోంచి బయటకొచ్చి..ఇది నా డ్రీమా రిషీ సార్ నీళ్లు తాగించలేదా అనుకుంటుంది.రిషీ నాదొక రిక్వస్ట్..ఇప్పుడు ముక్కుమీద దురదపుడితే ఎలా అని అనుకోకు..నేను ఇబ్బంది పడాలి అంటాడు. ఈ సీన్ భలే ఫన్నీగా ఉంటుంది. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు.
చెప్పుకుండానే ఫణీంద్ర, మహీ, సెక్రటరీ జగతి ఇంటికి వస్తారు. వాళ్లను చూసిన జగతి షాక్ అవుతుంది. మీరెంటి ఇలా, ఒక్క ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా అంటుంది. మహేంద్ర మేమే కాదు వెనకాల రిషీ సార్ వసూ కూడా వస్తుంది. జగతి మనసులో నా వళ్ల ఏమైనా తప్పు జరిగిందా అనుకుంటుంది. దామోదర్ మీ ప్రాజెక్టు గురించి విన్నాక మిమ్మల్ని చూడలనిపించి వచ్చాం అంటాడు. అలా వాళ్లు ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ ఉండగా..మన ఇగో మాష్టర్ బొకేతో వస్తాడు. కొడుకుని చూసి జగతి ఆనందానికి హద్దులుండవు. రిషీ బొకే జగతికి ఇచ్చి మేడమ్ ఇది మీకోసమే అంటాడు. జగతి ఆనందంగా ఫీల్ అవుతుంది..కానీ రిషీ వెంటనే పెద్దలు ప్రిన్సిపల్ సెక్రటరీగారు మీకు ఇస్తారు అని దామోదర్ గురించి పొగుడుతూ బొకే తనకు ఇస్తాడు. దామోదర్ జగతికి బొకే ఇస్తాడు. వసూని ప్రాజెక్టు డీటెల్స్ పెండ్రైవ్ లో కాపీ చేసి, తాగటానికి ఏమైనా తీసుకురా అంటుంది. ఇక్కడ జగతి వాళ్లు ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటారు.
వంటగదిలో వసూ కూల్ డ్రింక్స్ ప్రిపేర్ చేస్తూ..రిషీ సార్ ఆ బొకే మేడమ్ కి ఇస్తే బాగుండేది అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రిషీయే వంటగదిలోకి వస్తాడు. ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు అంటే..సాంబార్ లాగే వలకపోస్తావేమోఅని అంటాడు రిషీ..నేను హెల్ప్ చేస్తాను అని అంటాడు. ట్రే తీసుకుంటా అని బలవంతం చేస్తాడు. వసూ వద్దంటుంది. వసూ ట్రే తీసుకుని వస్తుంది..ముందు రిషీ వస్తాడు. వాళ్లను అలా జగతి చూస్తుంది. వసూ చేతిలోంచి కూల్ డ్రింక్స్ తీసుకుని జగతి అందరికి ఇస్తుంది..మనోడు ముందు వద్దంటాడు..ఆ దామోదర్ చెప్పి తీసుకోండి అది ఇదీ అంటే అప్పుడు తీసుకుని తాగుతాడు. దామోదర్..మీరంతా ఒక ఫ్యామిలీలా కలిసి పనిచేయండి మేడమ్ అంటాడు. ఆ మాటకు పాపం జగతి మహేంద్ర ఫీల్ అవుతారు.. రిషీకి వాళ్లు మాట్లాడుకునేదంతా బోర్ కొడుతుంది. దిక్కులు చూస్తాడు. జగతి.. సార్ ఏమన్నా కావాలా అని అడుగుతుంది. రిషీ వసుధారతో.. వసుధార లాప్ టాప్ తో చిన్న పని ఉంది మేడమ్ అంటాడు. జగతి అక్కడుంది అంటుంది. మహేంద్ర రిషీ మనసులో ఏం మెదులుతుంది, జగతి ఇంట్లో ఇంత ఫ్రీగా మూవ్ అవుతున్నాడేంటి అనుకుంటాడు.
రిషీ వసూ రూంలోకి వెళ్తాడు. చూసుకోకుండా వసుధార ఏంటి మేడమ్ మీ అబ్బాయి వచ్చారుగా పార్టీ ఇస్తారా అంటూ మాట్లాడుతుంది. రిషీ సౌండ్ చేసేసరికి లేచి నిలబడుుతంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో రిషీ ఆరోజు డీఐజీ ఇంటికి వసూ కట్టుకొచ్చిన శారీ చూసి ఆరోజు అడిగావ్ కదా..చీరలో ఎలా ఉన్నాను అని బాగుంది అంటాడు. చీరా, నేనా అని వసూ క్లారిటీ అడుగుతుంది. బాగుంది అన్నాను కదా బాగుంది అంతే అని చీర కట్టుకుని బయట తిరగకు అంటాడు. వసూకి అర్థంకాదు. ఆ మాట వెనుక అర్థం ఏంటో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.