రోడ్డు పై అర్ద నగ్నంగా వీడియో షూట్..పోలీసుల ఎంట్రీ తో..

-

సోషల్ మీడియా ప్రభావం యువకుల మీద ఎంత వుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. ఎలాగైనా క్రేజ్ ను సంపాదించాలని వింత వింత పనులు చేస్తున్నారు.. అలా చెయ్యడం వల్ల క్రేజ్ మాట దేవుడేరుగు..చిక్కుల్లొ పడిన ఘటనలు కూడా లేకపోలేదు.. ముఖ్యంగా ఫ్రాంక్ వీడియోలతో.. ఒకప్పుడు ప్రాంక్ అంటే నలుగురిని నవ్వించడానికి ఉపయోగపడేది.. కాని ఇప్పుడు అదే నలుగురిని ఇబ్బంది పెడుతోంది.ఈ మధ్యకాలంలో యువత ప్రాంకుల పేరుతొ వెకిలి చేష్టలు చేస్తున్నారు. ఇక మరికొందరు అయితే.. కాస్త హద్దు దాటి మరీ.. బోల్డ్ కంటెంట్‌తో పాపులారిటీ సంపాదిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కేరళలో వెలుగు చూసింది.

విషయానికొస్తే.. కేరళకి చెందిన ఇద్దరు యువకులు ప్రాంక్ పేరిట వెకిలి చేష్టలు చేశారు. వాళ్లిద్దరూ జోరు వానలో ఓ బైక్‌పై వెళ్తూ.. అర్ధనగ్నంగా స్నానం చేశారు. అంతేకాదు స్నానం చేయడానికి సోప్ కూడా ఉపయోగించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా వీరి వెకిలి చేష్టలు కంటిన్యూ కావడంతో అక్కడున్న వారంతా ఆ ఇద్దరిని వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మ్యాటర్ పోలీసుల వరకు వెళ్ళింది..వెంటనే రంగంలోకి దిగిన పొలిసులు యువకులకు వరుస షాక్ లు ఇచ్చారు.ఆ యువకులు భరణిక్కవుకు చెందిన అజ్మల్, బాదుషాలుగా గుర్తించారు.

ఆ తర్వాత వారిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి.. రూ. 5 వేలు జరిమానా విధించారు. కాగా, తాము ఓ ఈవెంట్ నుంచి తిరిగి ఇంటికి వస్తున్నామని.. వాన పడుతుండటంతో సరదా కోసం ప్రాంక్ చేశామని చెప్పారు.ఇది విన్న పోలీసులు ఫైన్ కట్టాల్సిందె అనడంతో తప్పక,ఇంక చేసెదెమి లేక అడిగినంత చెల్లించాల్సి వచ్చింది.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..పోలీసులు తిక్క కుదిర్చారు అంటూ కామెంట్లు వెళ్లు విరుస్తున్నాయి..మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేసుకొండి..

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version