హ‌మారా స‌ఫ‌ర్ : సీపీఎస్ స‌మ‌స్య అలానే ! కాద‌న్న‌దెవ్వ‌రు ?

-

ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఉద్యోగికి ఆర్థిక భ‌ద్ర‌త పింఛ‌ను. దీనికి రెండు ప‌ద్ధ‌తులు ఉన్నాయి.. ఒక‌టి ఓపీఎస్ రెండు సీపీఎస్. ఓల్డ్ పెన్ష‌న్ స్కీంలో ఉద్యోగికి ల‌బ్ధి ఎక్కువ. కానీ దాంతో పోలిస్తే సీపీఎస్ అన్న‌ది చాలా అంటే చాలా త‌క్కువ. ఓపీఎస్ విధానం ద్వారా ఓ ఉద్యోగి విధుల నుంచి విర‌మ‌ణ పొందాక పీఆర్సీ వ‌ర్తిస్తుంది ఇంకా ఇత‌ర ఆర్థిక ప్ర‌యోజ‌నాలు (క‌ర‌వు భ‌త్యంలాంటివి) కూడా వ‌ర్తిస్తాయి. కానీ ఇప్పుడున్న సీపీఎస్ కు అవేవీ వ‌ర్తించ‌వు.
క‌నుక ఓపీఎస్ ఉద్యోగి వెరీ కాన్ఫిడెంట్ గా ఉంటాడు. కానీ సీపీఎస్ ఉద్యోగి నిరంతర అభ‌ద్ర‌త‌తో ఊగిస‌లాడుతాడు. అయితే విచార‌క‌రం అయిన విష‌యం ఏంటంటే  ఉద్యోగుల భ‌విష్య నిధి కి సంబంధించిన మొత్తాల‌ను కూడా ఏపీ ప్ర‌భుత్వం త‌న అవ‌స‌రాల‌కు వివిధ ప‌థ‌కాల వ‌ర్తింపున‌కు వాడుకుంది. దీనిపై ఉద్యోగ సంఘాలు అప్రమ‌త్తం కావ‌డంతోనే స‌మ‌స్య కాస్త‌యినా స‌ర్దుమ‌ణిగింది.
.
రెగ్యుల‌ర్ పెన్ష‌నర్ పొందే ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌న్నింటినీ ఇవ్వాలంటే కుద‌ర‌దు. అది కాని ప‌ని కూడా ! అస‌లు ఇప్ప‌టికిప్పుడు ఎవ్వ‌రైనా రిటైర్ అయితే వెంట‌నే వారికి ఫైనాన్షియ‌ల్ సెటిల్‌మెంట్లు చేయ‌డం కూడా కుద‌ర‌ని ప‌ని ! అంత బాగుంది మ‌న ఖ‌జానా.క‌నుక తీవ్ర అన‌నుకూల ప‌రిస్థితుల నేప‌థ్యంలో సీపీఎస్ అన్న‌ది ఓ పెద్ద స‌మ‌స్య‌గానే ఉంది. ఇక‌పై ఉండ‌నుంది కూడా ! ప్ర‌భుత్వాలు త‌మకు అనుగుణంగా సంక్షేమ ప‌థ‌కాల పేరిట ల‌క్ష కోట్ల‌కు పైగా నిధులు వెచ్చించేందుకు కూడా వెనుకాడ‌డం లేదు. దీంతో ఉద్యోగుల‌కు వారి స‌మ‌స్య‌ల‌కు ఇప్ప‌టికిప్పుడు ప‌రిష్కారం ల‌భించ‌డం క‌ష్ట‌మే ! అందుకే తెలివిగా ఎవ‌రు అడిగినా అడ‌గ‌క‌పోయినా ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు చంద్ర‌బాబు  58 నుంచి 60 కి పెంచితే, ప్ర‌స్తుత జ‌గ‌న్ స‌ర్కారు 60 నుంచి 62 చేశారు. ఇది కూడా ఓ విధంగా పొలిటిక‌ల్ గేమ్ అని ప‌రిశీల‌కులు అంటున్నారు.ఆర్థికంగా ఏమీ లేని రాష్ట్రం, పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్ర‌మేన‌ని, ఈ త‌రుణాన కూడా కొత్త పీఆర్సీ పేరిట ఎంతో కొంత ఆర్థిక ప్రయోజ‌నం ద‌క్కే విధంగానే ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు ఉన్నాయ‌ని, కేటాయింపుల్లో ఎక్కువ భాగంగా ఉద్యోగుల జీత‌భ‌త్యాల‌కే పోతుండ‌డంతో ప్ర‌భుత్వం ప్ర‌తి నెలా ఓవ‌ర్ డ్రాఫ్ట్ (ఓడీ) తీసుకోక త‌ప్ప‌డం లేదు. అప్పులు కోసం తీవ్రమ‌యిన ప్ర‌తిఘ‌ట‌న‌ను చవిచూడ‌క త‌ప్ప‌డం లేదు. ఆ రోజు ఇవేవీ ఊహించ‌కుండా అస్స‌లు వాస్త‌విక స్థితిగ‌తులు అంచ‌నా వేయ‌కుండా జ‌గ‌న్ మాత్రం సీపీఎస్ ర‌ద్దుకు సై అన‌డ‌మే ఆశ్చ‌ర్య‌క‌రం. ఇక ఈ విష‌య‌మై మంత్రుల క‌మిటీ పేరిట కాల‌యాప‌న అంతా ఇంతా కాదు. క‌నుక రాజ‌కీయ పార్టీలు సాధ్యం కాని హామీలు ఇవ్వ‌క‌పోవ‌డ‌మే మేలు.

కాంట్రిబ్యూటరీ పెన్ష‌న్ స్కీం క్లుప్తంగా సీపీఎస్ ర‌ద్దుకు సంబంధించి ఇప్ప‌టికీ స‌మ‌స్య అలానే ఉంది. దీనిని సీఎం వ‌ర్గాలు పెద్ద‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. వాస్త‌వానికి రాష్ట్ర ఖ‌జానాకు తీవ్ర ఆర్థిక భారం అయ్యే ఈ సీపీఎస్ పై అప్ప‌ట్లో చంద్ర‌బాబు కూడా  పెద్ద‌గా ఏమీ చేయ‌లేక‌పోయారు. ఆయ‌నే కాదు ఏ సీఎం కూడా సెంటిమీట‌ర్ దూరం కూడా పోలేరు. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక స్థితిగ‌తులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు  అంత‌గా అనుకూలంగా లేవు. కేంద్రం కూడా ఈ విష‌య‌మై భారం అంతా రాష్ట్రాల‌దే అన్న విధంగా మాట్లాడుతుందే కానీ దీన్నొక మాన‌వీయ కోణంలో ఆలోచించ‌డం లేదు. దీంతో పింఛ‌ను భిక్ష కాదు హ‌క్కు అని ఎన్నో సార్లు నిన‌దిస్తూ రోడ్లెక్కిన ఉద్యోగుల‌కు నిరాశే మిగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news