పీకే వ్యూహంతో కేసీఆర్, కాంగ్రెస్ కలిసిపనిచేయబోతున్నారు: బీజేపీ నేత లక్ష్మణ్

-

ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయంటూ బీజేపీ నేత, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతూ… కాంగ్రెస్ లో చేరుతున్నారని.. అదే విధంగా టీఆర్ఎస్ తో చర్చలు జరుపుతున్నారని లక్ష్మణ్ అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొవడానికి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శక్తి సరిపోదు కాబట్టి… ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని.. అందుకే టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కు దగ్గర చేస్తున్నారని ఆరోపించారు. కార్లో షికార్ చేస్తూ కాంగ్రెస్ ను బలపరుస్తున్నారని… మొదటి నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు వేరు కావని మొదటి నుంచి బీజేపీ ఆరోపిస్తుందని ఆయన అన్నారు. బీజేపీ పెరుగుతన్న ఆదరణను చూసి పరోక్షంగా వ్యూహరచన చేస్తున్నారని ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ తో ఒప్పందం చేసుకున్నారని… రెండు వేరువేరు కాదని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ తో కలిసి పనిచేసేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంటే… తెలంగాణ కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుందని అన్నారు. మోడీ మూడోసారి అధికారంలోకి రాకూడదని పీకే వ్యూహం అని లక్ష్మణ్ అన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని… కుటుంబ పాలన నుంచి విముక్తి పొందడానికి చూస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news