పల్లె సౌభాగ్యమే.. దేశ సౌభఆగ్యం.. భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు : పవన్ కళ్యాణ్

-

సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్యరాసులను మోసుకువచ్చే ఈ సంక్రాంతి పండుగ వేళ భారతీయులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పండుగ సందడిలో తెలులు రాష్ట్రాల పల్లెలు శోభాయమానంగా మారాయని పేర్కొన్న ఆయన.. భారతీయులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసారు. పల్లె సౌభాగ్యమే.. దేశ సౌభాగ్యం అని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలన్నారు.

రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగి మంటలు..పిండి వంటలు సమ్మెళనమే సరదాల సంక్రాంతి, అటువంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగులు తీశాయి. ఇది ప్రజలకు ఈ పండుగ పై ఉన్న మక్కువను తెలియజేస్తుంది. ఉపాధి కోసం పల్లె బిడ్డలు నగరాలకు వలసపోవడతో గ్రామాలు జనాలు లేక కొంత వరకు పలుచబడ్డాయి. ఈ సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉంది. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం.. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ, సంతోషాలతో విరాజిల్లాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తన ప్రకటనలో తెలిపారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news