హరీష్ వర్సెస్ అంబటి.. మధ్యలో బాబు బుక్..!

-

మళ్ళీ ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మొదలైంది..ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య వార్ నడిచింది. అయితే ఎప్పుడు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం..తెలంగాణలోని కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలేదు. కానీ తెలంగాణలో జరిగే అభివృద్ధిని హైలైట్ చేయడం కోసం, ఏపీలో సరిగ్గా లేదనే అంశాన్ని తెలంగాణ మంత్రులు హైలైట్ చేస్తున్నారు. తాజాగా కూడా మంత్రి హరీష్ రావు.. పోలవరం కాళేశ్వరం కంటే ముందే స్టార్ట్ అయినప్పటికీ పూర్తి కాలేదని, అక్కడ ఇంజినీర్లతో మాట్లాడనని, మరో అయిదేళ్లకు కూడా పోలవరం పూర్తి కాదని హరీష్ సెటైర్ వేశారు.

అంటే కాళేశ్వరం ప్రాజెక్టుని తాము ముందుగా పూర్తి చేశామనే కోణంలో హరీష్ మాట్లాడారు. ఆ వెంటనే హరీష్‌కు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు అక్కడ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని చెప్పారో లేదా తమ ప్రభుత్వాన్ని కించపరచడానికి పోల్చారో తెలియదుగానీ కాళేశ్వరం ప్రాజెక్టు వేరు, పోలవరం ప్రాజెక్టు వేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని అంబటి తేల్చి చెప్పారు.

కాళేశ్వరం 2 టి‌ఎం‌సిల కెపాసిటీ ప్రాజెక్టు అని, పోలవరం 196 టి‌ఎం‌సి కెపాసిటీ అని అన్నారు. కాకపోతే పోలవరం ఆలస్యం అవుతుందని, ఇక దానికి కారణం చంద్రబాబు అని యథావిధిగా బాబుపై నెపం తోయడానికి చూశారు. అంటే ఇక్కడ ఏపీ కంటే తెలంగాణ ముందుందని తెలంగాణ నాయకులు చెప్పుకుంటుంటే..ఏపీ నాయకులు మాత్రం తప్పులని గత చంద్రబాబు ప్రభుత్వంపై తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూడున్నర ఏళ్లలో ఏం చేశారనేది చెప్పడం లేదు.

పోనీ గత ప్రభుత్వం అవినీతి చేస్తే, దాన్ని తేల్చారు. ఏంటో ఏ విషయమైన తప్పించుకుని, బాబు పైనే తప్పులు తోసేస్తున్నారు. మరి పోలవరం ఎప్పటికీ పూర్తి అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news