బీజేపీ చేసేది లేదు…కాంగ్రెస్ గెలిచేది లేదు : హరీష్‌ రావు

-

బీజేపీ చేసేది లేదు…కాంగ్రెస్ గెలిచేది లేదన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ పాలన అంటేనే కష్టాలు, కన్నీళ్లేనన్నారు. నరేంద్ర మోదీ తెలంగాణకు వొచ్చి జాకీలు పెట్టి లేపినా బీజేపీకి డిపాజిట్ రాదన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో రాబోతుందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు హరీశ్ రావు. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. కేంద్రం సహకరించకున్నా… అభివృద్ధి ఆగడం లేదని చెప్పారు. ప్రతీ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టామని తెలిపారు. అప్పట్లో డాక్టర్ సీటు రాక..విద్యార్థులు విదేశాలకు వెళ్లారని గుర్తుచేశారు.

కేసీఆర్ 9 ఏండ్లలో 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించారన్నారు. ఇప్పుడు లక్ష ర్యాంక్ వచ్చినా డాక్టర్ సీటు వస్తోందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ బహిరంగ సభలో హరీశ్ మాట్లాడారు. కేసీఆర్ హయాంలో పోడు భూములకు పట్టాలు, ప్రతి గ్రామానికి రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి పెళ్లికి కళ్యాణ లక్ష్మి, ప్రతి బిడ్డకు కేసిఆర్ కిట్టు, ప్రతి రైతుకు 24 గంటల కరెంటు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక కల్యాణ లక్ష్మి పథకం. రాజకీయాలకు అతీతంగా పేదింటి ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గత ప్రభుత్వం మూడు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిస్తే కేసీఆర్ ప్రభుత్వం 4 లక్షల 6 వేల ఎకరాలకు పోడు పట్టాలిచ్చింది. ములుగు నియోజకవర్గంలోనే 14 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version