కేసీఆర్ ఈ ఎనిమిది సంవత్సరాల పాలనా కాలంలో తెలంగాణాలో చాలా మార్పులను తీసుకువచ్చారు. తాజాగా మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది BRS ప్రభుత్వం. హైద్రాబాద్ లో రెండు వేల పడకలతో నిమ్స్ హాస్పిటల్ ను నిర్మించడానికి ముందు అడుగు వేశారు, అందులో భాగంగా ఈ రోజు భూమిపూజను తలపెట్టారు. కాగా అతి త్వరలోనే ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లను త్వరలోనే పూర్తి చేయాలని హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఇక ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న గాంధీ సూపర్ స్పెషలిటీ ఎం సి హెచ్ ను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ వైద్య సిబ్బంది మంచిగా ప్రజలకు సేవలను అందించి ప్రజల ఆశీస్సులు పొందాలని కోరారు. అంతేకాకుండా త్వరలోనే 5204 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.