టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్..పేరు వినగానే పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరికీ గుర్తొచ్చే సినిమా ‘గబ్బర్ సింగ్’. ఎంటర్ టైన్మెంట్ కా బాప్ అనేలా ఆ సినిమాను తీసి పవన్ కల్యాణ్ అశేష అభిమానులకు మాంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇచ్చాడు పవర్ స్టార్ వీరాభిమాని హరీశ్ శంకర్.
ప్రస్తుతం హరీశ్ శంకర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. పవన్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఈ క్రమంలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు హరీశ్. కాగా, హరీశ్ తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.
త్రోబ్యాక్ క్యాప్షన్ తో హరీశ్ శంకర్..పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ మహారాజ రవితేజ తో దిగిన ఫొటో ఒకటి షేర్ చేశాడు. అంతే ఆ ఫొటో చూసి సరికొత్త కాంబినేషన్ రాబోతున్నదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ కాంబో సెట్ చేయండి అన్న అని హరీశ్ శంకర్ ను అడుగుతున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే హరీశ్ శంకర్ దర్శకత్వంలో హీరోలుగా పవన్ కల్యాణ్, రవితేజ నటించనున్నారు. ఈ ఫొటో చూసి పవన్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
‘భవదీయుడు భగత్ సింగ్’ నెక్స్ట్ లెవల్ లో ఉండాలని హరీశ్ కు సూచిస్తున్నారు అభిమానులు. ఈ ఫొటో బహుశా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా షూటింగ్ సందర్భంగా తీసినది అయి ఉంటుందని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
#throwback pic.twitter.com/z9Nd15Espk
— Harish Shankar .S (@harish2you) May 6, 2022