ఇక నుండి వాట్సాప్‌లో ఈ ఫీచర్ కూడా…!

-

ఈ మధ్య కాలం లో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతూనే వుంది. ప్రతీ ఒక్కరు కూడ స్మార్ట్ ఫోన్ ని వాడుతున్నారు. అలానే పాపులర్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ ని కూడా వాడుతున్నారు. అయితే వాట్సాప్‌కు కొత్త ఫీచర్లు వస్తూనే ఉన్నాయి. ఇటీవల వరుసగా కొత్త సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి.

మరి ఇక తాజాగా వచ్చిన కొత్త ఫీచర్ కోసం కూడా చూద్దాం. టెలిగ్రామ్, యాపిల్ ఐమెసేజ్, స్లాక్ లాంటి వాటిలో ఉన్న ఈ ఎమోజీ రియాక్షన్‌ వాట్సాప్‌కు కూడా వస్తోంది. అయితే మరి ఈ ఎమోజీ రియాక్షన్‌ అంటే ఏమిటి..?, ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ లేదా వ్యక్తిగత చాట్‌ లో మెసేజ్‌లకు ఎమోజీ తో మనం రియాక్షన్ ఇవ్వొచ్చు.

మీ ఫీలింగ్స్, ఎమోషన్స్‌ను ఎమోజీల ద్వారా ఇతరుల కి మనం పంపచ్చు. ఈజీగా మనం టెక్ట్స్ అవసరం లేకుండా ఆ మేసెజ్‌కు ఎమోజి ద్వారా రిప్లై ఇవ్వచ్చు. ఇక ఈ ఎమోజీ రియాక్షన్‌ను ఎలా వాడాలి అనేది చూస్తే..

మీరు ముందు ఒక కాంటాక్ట్ చాట్ లేదా గ్రూప్ చాట్‌లోకి వెళ్లండి.
ఏ మెసేజ్ మీద రియాక్ట్ అవ్వాలో మెసేజ్‌పై ట్యాప్ చేసి, అలాగే హోల్డ్ చేసి పట్టుకోండి.
నెక్స్ట్ మీకు ఎమోజీల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులోని ఏదైనా ఎమోజీని ఎంచుకో వచ్చు.
ప్రస్తుతం ఈ రియాక్షన్ ఫీచర్‌లో ఆరు ఎమోజీలు ఉన్నాయి. త్వరలో మరిన్ని ఎక్స్‌ప్రెషన్స్ కూడా వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news